
Lakhimpur Kheri: న్యాయం జరగాలంటే.. ఆయన మంత్రి పదవి పోవాలి: ఎంపీ సంజయ్ సింగ్
ఉత్తరప్రదేశ్: లఖింపుర్ కేరి హింసాత్మక ఘటనలో అరెస్టయిన ఆశిష్ మిశ్రా తండ్రి అజయ్ కుమార్ మిశ్రా కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నంత కాలం మరణించిన రైతు కుటుంబాలకు న్యాయం జరగదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. అరెస్టయిన వ్యక్తి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారని వెంటనే ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.‘‘అజయ్ కుమార్ మిశ్రా హోం శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నంత కాలం ఈ కేసులో బాధితులకు న్యాయం జరగదు’’ అని ఆయన ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.
భాజపా, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆశిష్‌ను కాపాడటానికి తమ వంతు ప్రయత్నాలు చేశాయని ఆయన ఆరోపించారు. అయితే ఈ విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్న తర్వాతనే నిందితుడిని అరెస్టు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోలేదని.. మోదీ కూడా మౌనం పాటించారని పేర్కొన్నారు. ‘‘భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక రైతులను చీడ పురుగుల్లా చూస్తూ చితకబాదుతున్నారు. ఈ సంఘటనలు జలియన్‌వాలాబాగ్‌లో డ్వేయర్ పాలనను గుర్తు చేస్తున్నాయి. ప్రధాని ఆ దృశ్యాలను చూడలేదా? హృదయవిదాకరమైన ఘటనలు ఆయనకు కనిపించలేదా?’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘ఈ కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రా అరెస్టయ్యాడు. అజయ్ కుమార్ మిశ్రాను మంత్రి పదవి నుంచి ఎప్పుడు తొలగిస్తారని దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతున్నారు’’ అని సంజయ్ సింగ్ అన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.