Constitution Day: ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ కూడా పరిపూర్ణం కాదు: సీజేఐ

రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో కొలీజియం(Collegium)తోసహా ఏ వ్యవస్థ కూడా పరిపూర్ణమైనది కాదని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌(Justice DY Chandrachud) వ్యాఖ్యానించారు. ప్రస్తుతమున్న వ్యవస్థలోనే పని చేయడం దీనికి పరిష్కారమని తెలిపారు.

Published : 26 Nov 2022 00:06 IST

దిల్లీ: రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో కొలీజియం(Collegium)తోసహా ఏ వ్యవస్థ కూడా పరిపూర్ణమైనది కాదని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌(Justice DY Chandrachud) వ్యాఖ్యానించారు. ప్రస్తుతమున్న వ్యవస్థలోనే పని చేయడం దీనికి పరిష్కారమని తెలిపారు. న్యాయమూర్తులు రాజ్యాంగాన్ని అమలు చేసే విశ్వసనీయ సైనికులని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌(SCBA) ఆధ్వర్యంలో దిల్లీలో శుక్రవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో సీజేఐ పాల్గొని మాట్లాడారు. న్యాయవృత్తి తన వలసవాద లక్షణాలను వదులుకోవాల్సిన అవసరం ఉందని చెబుతూ.. ముఖ్యంగా న్యాయవాదుల కఠినమైన డ్రెస్‌ కోడ్‌ అంశాన్ని పునఃపరిశీలించవచ్చని అన్నారు.

కొలీజియం వ్యవస్థపై మాట్లాడుతూ.. ‘రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ఏ సంస్థ పరిపూర్ణమైనది కాదు. కానీ.. మేం రాజ్యాంగ పరిధిలోనే పని చేస్తున్నాం. నాతోసహా కొలీజియంలోని న్యాయమూర్తులందరూ.. రాజ్యాంగాన్ని అమలు చేసే నమ్మకస్తులైన సైనికులం. లోపాల విషయంలో మాట్లాడితే.. ఉన్న వ్యవస్థలోనే మన మార్గంలో పనిచేయడం దీనికి పరిష్కారం’ అని అన్నారు. కొత్త సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగం నిరంతరం పరిణామం చెందుతోందని సీజేఐ పేర్కొన్నారు. సామాన్య పౌరులకు న్యాయం అందించే లక్ష్యంలో.. న్యాయవ్యవస్థ, న్యాయవాదులు ఇరువురు సమాన వాటాదారులని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని