Published : 11 Jan 2022 15:38 IST

Corona: భయపడొద్దు.. దిల్లీలో లాక్‌డౌన్‌ ఉండదు

సీఎం కేజ్రీవాల్‌ 

దిల్లీ: కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ దిల్లీలో లాక్‌డౌన్‌ విధించబోమని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టంచేశారు. ఈరోజు 22వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావొచ్చని అంచనా వేశారు. ఎవరూ భయపడొద్దు.. లాక్‌డౌన్‌ ఉండదన్నారు. దిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) సమావేశంలో రాజధాని ప్రాంతమంతా ఆంక్షలు అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులను కోరామనీ, వారు అందుకు హామీ ఇచ్చినట్టు కేజ్రీవాల్‌ తెలిపారు. మరోవైపు, దేశ రాజధాని నగరంలో కొవిడ్‌ కట్టడికి ఉన్న అన్ని అవకాశాలనూ అమలు చేస్తున్నారు. ప్రైవేటు కార్యాలయాలను మూసివేసి.. ఉద్యోగులందరికీ వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇవ్వాలంటూ ఆదేశాలు జారీచేశారు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇస్తూ దిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ (డీడీఎంఏ) నిర్ణయం తీసుకొంది. అలాగే, రెస్టారెంట్లు, బార్లను సైతం మూసివేసి టేక్‌ అవే, హోం డెలివరీలకు మాత్రమే అనుమతిస్తున్నట్టు పేర్కొంది.

మరోవైపు, దిల్లీలో కరోనా కేసులు గరిష్ఠ స్థాయికి ఇప్పటికే వచ్చేసిందనీ.. లేదంటే ఒకట్రెండు రోజుల్లో వస్తుందని దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అన్నారు. ఈ వారంలో మాత్రం రావడం ఖాయమని తెలిపారు. ఆ తర్వాత కేసులు తగ్గడం మొదలవుతుందని పేర్కొన్నారు. కానీ మరోసారి కర్ఫ్యూ విధించే అవకాశం రావొచ్చని పేర్కొన్నారు. దిల్లీలో నిన్న 19వేలకు పైగా కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని