అలా చేస్తే.. లాక్‌డౌన్‌ అవసరం లేదు..!

మహారాష్ట్రలో కొద్ది రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మునుపటి స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. అయితే, వైరస్‌ అరికట్టడానికి కొత్తగా లాక్‌డౌన్‌ విధించడం సమస్యకు పరిష్కారం కాదని ఆ రాష్ట్ర.....

Published : 15 Mar 2021 21:41 IST

ముంబయి: మహారాష్ట్రలో కొద్ది రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మునుపటి స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. అయితే, వైరస్‌ అరికట్టడానికి కొత్తగా లాక్‌డౌన్‌ విధించడం సమస్యకు పరిష్కారం కాదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే అభిప్రాయపడ్డారు. ఆంక్షలు మాత్రం కఠినతరం చేయనున్నట్లు తెలిపారు. కొత్త కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాల రేటు తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.

కొత్తగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో 85 శాతం మందికి వ్యాధి లక్షణాలు లేవని, దీంతో వారిని హోం క్వారెంటైన్‌కు వెళ్లాలని సూచించినట్లు మంత్రి వివరించారు. ‘‘అందరూ కరోనా జాగ్రత్తలు పాటించండి. కొత్తగా లాక్‌డౌన్‌ విధించడానికి అవకాశం ఇవ్వొద్దు. ట్రాకింగ్‌, టెస్టింగ్‌, ట్రీట్‌మెంట్‌ విధానాన్ని అనుసరిస్తున్నాం. కరోనా పరీక్షల సంఖ్యను కూడా పెంచాం. వివాహాలు, సమావేశాలకు పరిమితులు విధించాం. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ.. మాస్క్‌లు ధరించాలి. రాష్ట్రంలో వ్యాక్సిన్‌ కొరత లేదు. రోజూ లక్షకుపైగానే టీకా డోసులు అందిస్తున్నాం. సీనియర్‌ సిటిజన్‌లందరికీ వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నాం’’ అని మంత్రి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని