
నిఘా వైఫల్యం లేదు.. 25-30 మంది నక్సలైట్ల హతం
వెల్లడించిన సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్సింగ్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో నిఘా వ్యవస్థ వైఫల్యం ఏమాత్రం లేదని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్సింగ్ స్పష్టం చేశారు. ఎదురుకాల్పుల ఘటనను పర్యవేక్షిస్తున్న ఆయన మావోయిస్టులపై దాడులకు రచించిన కార్యాచరణలోనూ లోపాలు లేవని వెల్లడించారు. ఏదైనా సమస్యను ముందుగా గుర్తిస్తే బలగాలు కూంబింగ్‌కు వెళ్లే పరిస్థితే ఉండదన్న కుల్దీప్సింగ్.. ఆపరేషన్‌లో వైఫల్యం ఉంటే ఎక్కువ మంది నక్సలైట్లు మరణించేవారేకాదని పేర్కొన్నారు.
బలగాల కాల్పుల్లో గాయపడిన, మృతిచెందిన వారిని మావోయిస్టులు మూడు ట్రాక్టర్లలో తరలించినట్లు సమాచారం అందిందని డీజీ తెలిపారు. కాగా ఈ ఆపరేషన్‌లో ఎంతమంది నక్సలైట్లు మృతిచెందారన్నదానిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమన్న కుల్దీప్సింగ్.. సుమారు 25 నుంచి 30 మంది మావోయిస్టులు చనిపోయి ఉంటారని అంచనా వేశారు. ఎదురుకాల్పుల్లో గాయాలపాలైన జవాన్లను ఈరోజు కలవనున్నట్లు ఆయన వెల్లడించారు.
జీజాపూర్-సుకుమా జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో శనివారం సైనికులు, మావోల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. పక్కా ప్రణాళికతో మావోలు ఈ దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఈ భీకర పోరులో మృతిచెందిన సైనికుల సంఖ్య 22కి చేరింది. మొత్తం 30 మంది జవాన్లు గాయపడగా వారిని హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా వారిలో పలువురి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (06-07-2022)
-
India News
IAF: యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు.. దేశంలోనే తొలిసారి!
-
Sports News
IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
-
Crime News
Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
-
Movies News
RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
-
General News
Harsh Goenka: బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో గోయెంకా, శిందే.. అసలు విషయం ఏంటంటే..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- PV Sindhu: ‘రిఫరీ తప్పిదం’తో సింధూకు అన్యాయం.. క్షమాపణలు చెప్పిన కమిటీ
- Jharkhand: బీటెక్ విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. IAS అధికారి అరెస్టు
- IAF: యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు.. దేశంలోనే తొలిసారి!
- Shruti Haasan: ఆ వార్తలు నిజం కాదు.. శ్రుతిహాసన్