Indian Railway: ప్రైవేటు ఆలోచనే లేదు: అశ్వని వైష్ణవ్‌

భారత రైల్వే వ్యవస్థను ప్రైవేటుపరం చేసే ఆలోచనే లేదని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ స్పష్టం చేశారు. లోక్ సభలో రైల్వేశాఖ కేటాయింపులపై జరిగిన చర్చ సందర్భంగా కేంద్రం రైల్వేను కూడా ప్రైవేటుపరం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోందని పలువురు ఎంపీలు ఆరోపించారు.

Published : 17 Mar 2022 12:43 IST

ధిల్లీ: భారత రైల్వే వ్యవస్థను ప్రైవేటుపరం చేసే ఆలోచనే లేదని కేంద్ర రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ స్పష్టం చేశారు. లోక్ సభలో రైల్వేశాఖ కేటాయింపులపై జరిగిన చర్చ సందర్భంగా కేంద్రం రైల్వేను కూడా ప్రైవేటీకరించేందుకు ప్రణాళికలు రచిస్తోందని పలువురు ఎంపీలు ఆరోపించారు. దీనిపై స్పందించిన మంత్రి రైల్వేను ప్రైవేటుపరం చేయడమనేది కేవలం ప్రతిపక్షాల ఊహాజనిత ఆలోచన మాత్రమేనని స్పష్టం చేశారు. రైల్వేలో ట్రాక్‌లు, స్టేషన్లు, రైలు ఇంజిన్లు, బోగీలు అన్నీ  ప్రభుత్వ ఆస్తులేనని, రైల్వేను ప్రైవేటుపరం చేసే ఆలోచనే లేదని పేర్కొన్నారు. రైల్వే శాఖలో ఉద్యోగ నియామకాలపై ఎటువంటి నిషేధం లేదన్న ఆయన 1.4 లక్షల పోస్టుల భర్తికీ ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని