
Yogi Adityanath: అయోధ్య మందిర నిర్మాణాన్ని ఆపే అధికారం ఎవరికీ లేదు: యోగి
లఖ్నవూ: అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఆపే అధికారం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2023నాటికి నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. బుధవారం రామ్ కథ పార్క్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన దీపోత్సవ వేడుకల్లో యోగి పాల్గొని మాట్లాడారు. ‘‘గత ప్రభుత్వాలు ప్రజాధనాన్ని ఖబరిస్థాన్ల నిర్మాణం కోసం ఖర్చు చేస్తే.. ధర్మం, సంస్కృతి పట్ల ప్రేమ ఉన్న భాజపా ప్రభుత్వం ఆలయాల కోసం వెచ్చిస్తోంది’’అని యోగి చెప్పారు.
ప్రపంచం ముందు అయోధ్య ఒక సరికొత్త సాంస్కృతిక నగరంగా నిలవబోతుందని, భవిష్యత్తులో జరిగే అభివృద్ధికి సాక్ష్యంగా నిలుస్తుందని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ అయోధ్య నగరం ప్రపంచవ్యాప్తంగా పర్యటకులను ఆకర్షిస్తుందన్నారు. రాష్ట్రంలో అయోధ్య రామ మందిరంతోపాటు 500 దేవాలయాలు, ఇతర మతాల ప్రార్థన మందిరాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. వాటిలో 300 ప్రాజెక్టులు పూర్తి కాగా.. మిగిలినవి మరో రెండు నెలల్లో సిద్ధమవుతాయని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.