
ఆ వ్యాఖ్యలు దేశ ఐక్యతను అడ్డుకోలేవు: షా
దిల్లీ: భారత్‌లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనపై అంతర్జాతీయ ప్రముఖులు జోక్యం చేసుకోవడాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తప్పుబట్టారు. వారి వ్యాఖ్యల్ని ప్రచారాలుగా తిప్పికొడుతూ.. అలాంటి వ్యాఖ్యలు దేశ ఐక్యతను చెరపలేవని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్విటర్ వేదికగా స్పందించారు.
‘ఏ ప్రచారం భారతదేశ ఐక్యతను దెబ్బతీయలేదు. ఏ ప్రచారం భారత్ కొత్త లక్ష్యాన్ని అధిగమించడాన్ని ఆపలేదు. అదేవిధంగా భారత తలరాతను ఏ ప్రచారం నిర్ణయించలేదు. పురోగతి సాధించడానికి భారత్ ఐక్యంగా, కలిసికట్టుగా ఉంది’ అని పేర్కొంటూ.. విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చేసిన పోస్ట్‌ను రీట్వీట్ చేశారు.
ఇప్పటికే అంతర్జాతీయ ప్రముఖుల స్పందనపై భారత విదేశాంగ శాఖ తనదైన శైలిలో స్పందించింది. దేశంలో జరుగుతున్న సంఘటనలపై కామెంట్ చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని ఓ ప్రకటన ద్వారా బదులిచ్చింది. సాగు చట్టాల్ని పార్లమెంటు పూర్తి చర్చల తర్వాతే ఆమోదించిందని.. కొన్ని స్వార్థ ప్రయోజనాల గ్రూపులు నిరసనలపై తమ ఎజెండాను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
భారత్‌లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై హాలీవుడ్ ప్రముఖురాలు, గాయని రిహానా స్పందించిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలపై ఓ ఇంగ్లీష్ మీడియా రాసిన కథనాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘మనమెందుకు ఈ ఆందోళన గురించి మాట్లాడకూడదు’ అంటూ పేర్కొన్నారు. దీంతో ఆమె ట్వీట్ కాస్తా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అనంతరం స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ సహా చాలా మంది అంతర్జాతీయ ప్రముఖులు రైతుల ఆందోళనపై స్పందిస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం.
ఇదీ చదవండి
ప్రముఖుల వ్యాఖ్యలు బాధ్యతా రహిత్యం: విదేశాంగ శాఖ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG:యువరాజ్ సింగ్‌ను గుర్తుచేసిన బుమ్రా
-
General News
Telangana News: తెలంగాణలో మరో 1,663 ఉద్యోగాల భర్తీకి అనుమతి
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs ENG: వర్షంతో ఆటకు అంతరాయం.. ఇంగ్లాండ్ 3 ఓవర్లకు 16/1
-
Politics News
BJP: హైదరాబాద్ డిక్లరేషన్ పేరుతో భాజపా కీలక రాజకీయ తీర్మానం?
-
Business News
Ola Electric: ఈవీ రేస్: నాలుగో స్థానానికి ఓలా.. టాప్‌లో ఎవరంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- నీడనిచ్చి.. జాడ కరవయ్యావు!