
Taliban: అఫ్గాన్‌లో మహిళలపై మరిన్ని ఆంక్షలు.. ప్రయాణాలపై కొత్త నిబంధనలు
కాబుల్: అఫ్గాన్‌లో అధికారాన్ని కైవసం చేసుకున్న తాలిబన్లు.. వారి పాలనలో మహిళల హక్కులను హరిస్తున్నారంటూ అంతర్జాతీయ సంస్థలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో అక్కడి ప్రభుత్వం తాజాగా మరికొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. 72 కి.మీ దాటి ప్రయాణం చేయాలనుకునే మహిళలకు.. తోడుగా దగ్గరి మగ బంధువు ఉంటే తప్ప రవాణా సౌకర్యం కల్పించబోమని స్పష్టం చేసింది. హిజాబ్ ధరించిన మహిళలను మాత్రమే ఎక్కించుకోవాలని వాహన యజమానులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రమోషన్ ఆఫ్ వర్చ్యూ, ప్రివెన్షన్ ఆఫ్ వైస్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి సాదిక్ అకిఫ్ ముహాజిర్ ఆదివారం ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ఈ వివరాలు వెల్లడించారు. మహిళలు నటించిన డ్రామాలు, సోప్ ఒపెరాలను ప్రదర్శించడాన్ని నిలిపివేయాలంటూ ఈ శాఖ ఇటీవలే స్థానిక టీవీ ఛానెళ్లకు సూచించింది.
మహిళా టీవీ జర్నలిస్టులూ రిపోర్టింగ్ సమయంలో హిజాబ్ ధరించాలని అకిఫ్ ముహాజిర్ స్పష్టం చేశారు. ప్రజలు తమ వాహనాల్లో సంగీతం వినడాన్ని కూడా నిలిపేయాలన్నారు. ఆగస్టులో కాబుల్‌ను ఆక్రమించుకుని, అధికారం ఏర్పాటు చేసుకున్న తాలిబన్లు.. క్రమంగా మహిళలు, బాలికలపై అనేక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ చాలా మంది బాలికలు మాధ్యమిక విద్యకు దూరంగా ఉన్నారు. హక్కుల విషయమై మొదట్లో మహిళలు ఆందోళనలూ చేశారు. ఇదిలా ఉండగా.. వారి హక్కులను పరిరక్షించాలంటూ తాలిబన్ల సుప్రీం నేత ఈ నెల ప్రారంభంలో స్థానిక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. అ
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.