Prime Minister: ప్రధాని పోస్టు ఖాళీగా లేదు : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
భారత్లో ప్రధానమంత్రి (Prime Minister) పోస్టు ఖాళీగా లేదని.. మోదీ నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీఏ (NDA) విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. పీఎం అయ్యేందుకు మమతా (Mamata Banerjee)బెనర్జీకి అన్ని సామర్థ్యాలు ఉన్నాయంటూ అమర్త్యసేన్ (Amartya Sen) చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు.
కోల్కతా: ప్రధానమంత్రి (Prime Minister) అయ్యేందుకు టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి అన్ని సామర్థ్యాలు ఉన్నాయంటూ ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ (Amartya Sen) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉద్ఘాటించారు. ప్రస్తుతం ప్రధానమంత్రి పదవి ఖాళీగా లేదని.. ఈసారి కూడా ప్రజలు మోదీవైపే ఉన్నారని అన్నారు. కోల్కతా శివారులో జరిగిన భాజపా కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ధర్మేంద్ర ప్రధాన్ ఈ విధంగా స్పందించారు.
‘భారత్లో ప్రధానమంత్రి పదవి ఖాళీగా లేదు. దేశ ప్రజలు నరేంద్ర మోదీపై వరుసగా రెండుసార్లు విశ్వాసాన్ని నిరూపించారు. ఈసారి కూడా ప్రజలు మోదీవైపే ఉన్నారనే నమ్మకం ఉంది. పేద, మహిళలు, యువత, వెనకబడిన, గ్రామీణ ప్రజలు దేశాన్ని నడిపించే బాధ్యతను మోదీపై ఉంచారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందనడంలో ఎటువంటి అనుమానం లేదు’ అని పేర్కొన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలు (2024) పూర్తిగా భాజపాకు అనుకూలంగా ఉంటాయని భావించడం పొరబాటేనని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ ఇటీవల పేర్కొన్నారు. రానున్న ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడిన ఆయన.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి తదుపరి ప్రధాని అయ్యే సామర్థ్యం ఉందని వెల్లడించారు. ఆర్థికవేత్త చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే కేంద్ర మంత్రి ఈవిధంగా మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు