రసాయనశాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌..

రసాయన శాస్త్రంలో విశేష సేవలు అందించినందుకు గానూ ఈ ఏడాది ఇద్దరు వ్యక్తులకు నోబెల్‌ బహుమతి వరించింది. ఇమ్మాన్యూయెల్‌ చార్పెంటీర్‌, జెన్నీఫర్‌ ఏ డౌడ్నా అనే వ్యక్తులకు సంయుక్తంగా నోబెల్‌ పురస్కారానికి ఎంపికయ్యారు.

Updated : 07 Oct 2020 17:22 IST

స్టాక్‌హోం: రసాయన శాస్త్రంలో విశేష సేవలు అందించినందుకు గానూ ఈ ఏడాది ఇద్దరు వ్యక్తులకు నోబెల్‌ బహుమతి వరించింది. ఇమ్మాన్యూయెల్‌ చార్పెంటీర్‌, జెన్నీఫర్‌ ఏ డౌడ్నా సంయుక్తంగా నోబెల్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. ‘జీనోమ్‌ ఎడిటింగ్‌’ విధానంలో వారు చేసిన పరిశోధనలకు గానూ నోబెల్‌ పురస్కారం ప్రకటించారు. కాగా ఈ ఇద్దరిలో ఇమ్మాన్యూయెల్‌ ఫ్రాన్స్‌, జెన్నీఫర్‌ అమెరికాకు చెందినవారు.

‘వీరి పరిశోధనల ద్వారా మొక్కలు, జంతువుల డీఎన్‌ఏను మార్పు చేయడంపై కీలక అంశాలను వెల్లడించారు. అంతేకాకుండా ఈ సాంకేతికత జీవశాస్త్రాలపై విప్లవాత్మక ప్రభావాన్ని చూపిస్తుంది. క్యాన్సర్‌ చికిత్సలకు దోహదం చేస్తుంది. వారసత్వంగా సంక్రమించే వ్యాధులను దూరం చేయాలనే కలను సాకారం చేస్తుంది’ అని నోబెల్‌ కమిటీ వెల్లడించింది.

ఇప్పటికే మంగళవారం భౌతిక శాస్త్రంలో విశేష కృషి చేసిన ముగ్గురికి నోబెల్‌ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. విశ్వంలోని అత్యంత అరుదైన అంశమైన కృష్ణబిలంపై పరిశోధనలకు గానూ శాస్త్రవేత్తలు రోజర్‌ పెన్రోస్‌, రిన్‌హార్డ్‌ గెంజెల్‌, ఆండ్రియా గెజ్‌లకు నోబెల్‌ పురస్కారం ప్రకటించారు. అయితే ఇందులో రోజర్‌ పెన్రోస్‌కు సగం పురస్కారాన్ని ఇవ్వగా.. మిగతా సగాన్ని రిన్‌హార్డ్‌, ఆండ్రియాలు పంచుకోనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని