Yediyurappa: యడియూరప్పపై నాన్‌బెయిలబుల్‌ వారంట్‌

మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఓ బాలికను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై కోర్టు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారంటు జారీచేసింది.

Published : 14 Jun 2024 06:23 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఓ బాలికను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై కోర్టు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారంటు జారీచేసింది. నోటీసులు జారీచేసినా, ఆయన విచారణకు హాజరు కావట్లేదని సదాశివనగర పోలీసుల తరఫు న్యాయవాది వినిపించిన వాదనలను పరిగణనలోకి తీసుకుని ఒకటో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు న్యాయమూర్తి ఎన్‌ఎం రమేశ్‌ గురువారం ఈ ఆదేశాలను జారీచేశారు. దీనిపై మార్చి 17న కేసు నమోదైంది. ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరై స్వరపరీక్షకు యడియూరప్ప సహకరించారు. దిల్లీలో ఉన్నారని, 17న విచారణకు హాజరవుతారని పోలీసులకు ఆయన తరఫు న్యాయవాది ఇప్పటికే సమాచారాన్ని అందించారు. తాజా సమాచారం ప్రకారం.. యడియూరప్ప ముందస్తు బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. తనపై నమోదైన కేసును రద్దు చేయాలని ఇప్పటికే ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. తమ ముందు విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇలా నోటీసులపై నోటీసులు వస్తుండడం, విచారణకు హాజరైతే అరెస్టు చేస్తారనే కారణంతో ముందస్తు బెయిలు పిటిషన్‌ దాఖలుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని