North Korea: కిమ్‌ క్షిపణి..జుమ్మని దూసుకుపోయింది..

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలను ఏమాత్రం ఆపడంలేదు. తాజాగా మరో క్షిపణిని ప్రయోగించింది. ఇది ఏ శ్రేణికి సంబంధించిన కచ్చితంగా సమాచారం మాత్రం వెల్లడించలేదు. ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణులు, న్యూక్లియర్‌

Published : 05 Jan 2022 23:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలను ఏమాత్రం ఆపడంలేదు. తాజాగా మరో క్షిపణిని ప్రయోగించింది. ఇది ఏ శ్రేణికి సంబంధించిన కచ్చితంగా సమాచారం మాత్రం వెల్లడించలేదు. ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణులు, న్యూక్లియర్‌ ఆయుధాల పరీక్షలపై ఆంక్షలు ఉన్నాయి. 2022లో ఉత్తరకొరియా చేసిన తొలి ఆయుధ పరీక్ష ఇదే. ఈ విషయాన్ని జపాన్‌కు చెందిన కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది తొలిసారి గుర్తించారు. 

ఉ.కొరియా చేసిన పరీక్షను దక్షిణ కొరియా, అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ విషయాన్ని జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్స్‌ కూడా ధ్రువీకరించింది. జపాన్‌ రక్షణశాఖ మంత్రి నుబవు కిషి దీనిపై స్పందిస్తూ బాలిస్టిక్‌ క్షిపణి  500 కి.మీ. దూరం ప్రయాణించింది. ఇది దీర్ఘశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడాన్ని కొనసాగిస్తామని ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ పరీక్ష చోటు చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం దక్షిణ కొరియాలో ఆహార సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంది. ఆ దేశం సరిహద్దులను పూర్తిగా మూసివేయడం పరిస్థితి తీవ్రతను అద్దం పడుతోంది. ఉ.కొరియాలో పిల్లలు, వృద్ధులు పరిస్థితి దయనీయంగా మారనుందని ఐరాస హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు