ప్రముఖ శాస్త్రవేత్త రొద్దం నరసింహ కన్నుమూత

ప్రముఖ ఏరోస్పేస్‌ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత, ప్రొఫెసర్‌ రొద్దం నరసింహ (87) కన్నుమూశారు. మొదడులో రక్తస్రావం కావడంతో బెంగళూరులోని ఎంఎస్‌ రామయ్య

Updated : 15 Dec 2020 04:26 IST

బెంగళూరు: ప్రముఖ ఏరోస్పేస్‌ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత, ప్రొఫెసర్‌ రొద్దం నరసింహ(87) కన్నుమూశారు. మొదడులో రక్తస్రావం కావడంతో బెంగళూరులోని ఎంఎస్‌ రామయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఇస్రో, తేలికపాటి యుద్ధవిమానాలు, ప్రధాన శాస్త్రీయ కార్యక్రమాల్లో నరసింహ పాలుపంచుకున్నారు. రొద్దం నరసింహ ప్రొఫెసర్‌ సతీష్‌ ధావన్‌ మొదటి విద్యార్థి. ఆయన చనిపోయేవరకు చాలా ఉత్సాహంగానే విధులు నిర్వహించారు. బెంగళూరులోని ఐఐఎస్సీ, జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌లో శాస్త్రవేత్తగా ఉన్నారు. 

1955లో ఎంఈ పూర్తి చేసిన నరసింహ, 1957లో ఐఐఎస్సీలో ఎంఎస్సీ  పూర్తి చేశారు. అనంతరం 1961లో కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీ పట్టా పొందారు. అనంతరం భారత్‌కు వచ్చిన నరసంహ ఏరోస్పేస్‌, అట్మాస్ఫరిక్‌ ప్లూయిడ్‌ డైనమిక్స్‌లో పరిశోధనలు నిర్వహించారు. భారత ప్రభుత్వం చేపట్టిన అనేక విధాన రూపకల్పనల్లో ఆయన పాలుపంచుకున్నారు. నేషనల్‌ ఏరోస్పేస్‌ లాబోరేటరీస్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన ఎన్నో అవార్డులు సొంత చేసుకున్నారు. 1978లో భట్నాగర్‌ అవార్డు, 2013లో భారత అత్యున్నత రెండో పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్నారు. 

ఇదీ చదవండీ..

ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను మాకివ్వండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని