Vaccine: టీకా ధ్రువపత్రంలో తప్పులా?

కరోనా టీకా ధ్రువపత్రంలో పేరు, పుట్టినతేదీ వంటి వివరాల్లో తప్పులొచ్చాయా? అయినా కంగారుపడాల్సిన అవసరం లేదు. కొవిడ్‌ వెబ్‌సైట్‌ ద్వారా వాటిని సరిచేసుకునే వీలు కల్పించింది కేంద్ర ప్రభుత్వం.

Updated : 09 Jun 2021 14:53 IST

కొవిన్‌ ద్వారా సరిచేసుకోవచ్చని చెప్పిన కేంద్రం

దిల్లీ: కరోనా టీకా ధ్రువపత్రంలో పేరు, పుట్టినతేదీ వంటి వివరాల్లో తప్పులొచ్చాయా? అయినా కంగారుపడాల్సిన అవసరం లేదు. కొవిన్‌ వెబ్‌సైట్‌ ద్వారా వాటిని సరిచేసుకునే వీలు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. కొవిడ్‌ వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌లో మార్పులు చేసుకునేలా వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసినట్లు బుధవారం వెల్లడించింది.

‘‘కొవిన్‌ నమోదు సమయంలో పేరు, పుట్టినతేదీ, లింగం వంటి వివరాలను పొరబాటుగా తప్పుగా ఇస్తే టీకా ధ్రువపత్రంలో వాటిని సరిచేసుకోవచ్చు’ అని ఆరోగ్యసేతు ట్విటర్‌ ఖాతాలో కేంద్రం ట్వీట్ చేసింది. ఇందుకోసం కొవిన్‌ పోర్టల్‌లో ‘రైజ్‌ యాన్‌ ఇష్యూ’ అనే ఫీచర్‌ను యాడ్‌ చేసింది. దేశీయ, విదేశీ ప్రయాణాల సమయంలో ఈ టీకా ధ్రువపత్రాల అవసరం ఏర్పడుతుంది.

తప్పులు ఎలా సరిచేసుకోవాలంటే..

1. www.cowin.gov.in పోర్టల్‌ను ఓపెన్‌ చేయాలి.

2. మీ పది అంకెల మొబైల్‌ నంబరుతో లాగిన్‌ అవ్వాలి.

3. ఆ తర్వాత మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేస్తే మీ ఖాతా ఓపెన్‌ అవుతుంది.

4. ఆ తర్వాత Account Details అనే బటన్‌ని క్లిక్‌ చేయాలి. మీరు వ్యాక్సిన్‌ వేయించుకుంటే మీకు Raise an Issue అనే బటన్‌ కన్పిస్తుంది. దాన్ని క్లిక్‌ చేయాలి.

5. అప్పుడు Correction In Certificate(ధ్రువపత్రంలో కరెక్షన్‌) ఆప్షన్‌ కన్పిస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే పేరు, పుట్టినతేదీ, జెండర్‌లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు ఆప్షన్స్‌ కన్పిస్తాయి.

గమనిక: అయితే యూజర్లు తమ టీకా ధ్రువపత్రాన్ని ఒకేసారి ఎడిట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అప్‌డేట్‌ చేసిన సమాచారం తుది ధ్రువపత్రంపై కన్పిస్తుంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని