Omicron: ఒమిక్రాన్‌ విజృంభణ.. జర్మనీ కీలక నిర్ణయం

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విస్తృత వ్యాప్తి నేపథ్యంలో యూరప్‌ దేశాలు తిరిగి కఠిన నిబంధనల దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. బ్రిటన్‌లో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో.. రెండు వారాల లాక్‌డౌన్‌ విధించేందుకు అక్కడి అధికారులు చర్యలు...

Published : 19 Dec 2021 14:53 IST

బెర్లిన్‌: కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విస్తృత వ్యాప్తి నేపథ్యంలో యూరప్‌ దేశాలు తిరిగి కఠిన నిబంధనల దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. బ్రిటన్‌లో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో.. రెండు వారాల లాక్‌డౌన్‌ విధించేందుకు అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. మరోవైపు బ్రిటన్‌ నుంచి రాకపోకలపై ఫ్రాన్స్‌ తదితర దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి.

తాజాగా జర్మనీ ఈ జాబితాలో వచ్చి చేరింది. బ్రిటన్‌ను హై-రిస్క్‌ దేశాల జాబితాలో చేర్చింది. కేవలం జర్మన్‌లు, ఇక్కడ నివసించే విదేశీయులకు మాత్రమే యూకే నుంచి ప్రవేశానికి అనుమతి ఉందని.. వారు తప్పనిసరిగా నెగెటివ్‌ రిపోర్టు కలిగి ఉండాలని తెలిపింది. దీంతోపాటు వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండా రెండు వారాలపాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. స్థానిక హెల్త్‌ ఏజెన్సీ ఆర్‌కేఐ ప్రకటించిన ఈ నిబంధనలు ఆదివారం సాయంత్రం నుంచి అమల్లోకి రానున్నాయి. డెన్మార్క్, ఫ్రాన్స్, నార్వే, లెబనాన్‌లనూ జర్మనీ హై-రిస్క్ జాబితాలో చేర్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని