భారత్‌లోనూ ‘వింత’ ఏకశిల స్తంభం!

నిర్జన ప్రదేశాల్లో ప్రత్యక్షమై.. ఆ తర్వాత కొద్దిరోజులకే మాయమవుతూ పరిశోధకులను పరుగులు పెట్టిస్తున్న ఏకశిల ఇపుడు భారత్‌లోనూ ప్రత్యక్షమైంది. వివరాల్లోకి వెళితే అహ్మదాబాద్‌లోని సింపనీ ఉద్యానవనంలో ఆరడుగుల ఎత్తు కలిగి మెటల్‌తో కూడిన

Updated : 01 Jan 2021 17:54 IST

అహ్మదాబాద్‌: అమెరికాలోని ఉతహ్‌ నిర్జన ప్రాంతంలో ప్రత్యక్షమై కొన్ని రోజులకు అదృశ్యమైన ఏకశిల స్తంభం ఇప్పుడు భారత్‌లోనూ వెలిసింది! అయితే దాన్ని కృత్రిమంగా సృష్టించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ఓ గార్డెన్‌లో అలాంటి ఏకశిల స్తంభాన్నే నిర్వాహకులు ఏర్పాటు చేశారు. గురుద్వారాకు సమీపంలోని ఈ గార్డెన్‌లోని ఏకశిలను చూడటానికి నగర వాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ స్తంభంలో నుంచి తమ ప్రతిబింబాలను చూసుకొని, ఆ దృశ్యాలను కెమెరాలో బంధించుకోవచ్చని అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ గార్డెన్‌ విభాగం డైరెక్టర్‌ జిగ్నేష్‌ పటేల్‌ చెప్పారు. మూడు వైపుల పట్టకం ఆకారంలో తళుక్కుమనే ఈ స్తంభం ఏడు అడుగుల పొడవు ఉంటుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని