Kerala: సముద్రంలో తేలియాడే వంతెన.. ఒకేసారి 500 మందికి ప్రవేశం!

పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు కేరళ ప్రభుత్వం సమాయత్తమైంది. నీటిపై తేలియాడే వంతెనను  కోజికోడ్ జిల్లాలోని బైపొరే బీచ్ లో నిర్మించారు. కేరళలో ప్రముఖ సముద్ర తీరప్రాంతం...

Published : 27 Mar 2022 23:37 IST

కోజికోడ్‌: పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు కేరళ ప్రభుత్వం సమాయత్తమైంది. నీటిపై తేలియాడే వంతెనను కోజికోడ్ జిల్లాలోని బైపొరే బీచ్‌లో నిర్మించారు. కేరళలో ప్రముఖ సముద్ర తీర ప్రాంతమైన బైపొరే బీచ్‌లో కేరళ పర్యాటక శాఖ దీన్ని నిర్మించింది. పర్యాటకులు అలలపై నడిచేలా దీనిని ఏర్పాటు చేశారు. ఈ వంతెన 100 మీటర్ల పొడవు... 3 మీటర్ల వెడల్పు ఉంది. ఒకేసారి 500 మంది పర్యాటకులు వంతెనపై ఉండి అలలపై తేలియాడుతున్న అనుభూతి పొందవచ్చు. పర్యాటకులు వంతెనపైకి వెళ్లాలంటే లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా ధరించాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని