ఆ సమయాల్లో చెల్లింపులు చేయకండి

రానున్న కొద్ది రోజుల్లో యూపీఐ ఫ్లాట్‌ఫాంను అప్‌గ్రేడ్‌ చేయనున్న నేపథ్యంలో వినియోగదారులకు నేషనల్‌ పేమెంట్స్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్పీసీఐ) సూచనలిచ్చింది. ఈ మేరకు ఎన్పీసీఐ గురువారం ట్విటర్‌లో ఒక ప్రకటన చేసింది.

Published : 21 Jan 2021 19:09 IST

సూచించిన ఎన్పీసీఐ

దిల్లీ: రానున్న కొద్ది రోజుల్లో యూపీఐ ఫ్లాట్‌ఫాంను అప్‌గ్రేడ్‌ చేయనున్న నేపథ్యంలో వినియోగదారులకు నేషనల్‌ పేమెంట్స్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్పీసీఐ) సూచనలిచ్చింది. ఈ మేరకు ఎన్పీసీఐ గురువారం ట్విటర్‌లో ఒక ప్రకటన చేసింది. ‘‘యూపీఐ చెల్లింపుల్లో వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడంలో భాగంగా కొద్ది రోజుల పాటు అర్ధరాత్రి ఒంటిగంట నుంచి 3గంటల మధ్య ప్రాంతంలో యూపీఐను అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. దీని వల్ల వినియోగదారులకు కొద్ది రోజుల పాటు అసౌకర్యం తలెత్తవచ్చు. ’’ అని ఎన్పీసీఐ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ప్రకటించింది. సంస్థ పేర్కొన్న సమయంలో కాకుండా ఇతర సమయాల్లో డిజిటల్‌ చెల్లింపులు చేసుకోవచ్చని వారు సూచించారు. ఎన్పీసీఐ ఆ ట్వీట్‌లో కొద్ది రోజులు అని పేర్కొంది కాని ఎన్ని రోజుల పాటు అప్‌గ్రేడ్‌ ప్రక్రియ జరుగుతుందన్న విషయాన్ని వెల్లడించలేదు.

ఇవీ చదవండి..

భారత్‌లో రష్యా టీకా మూడోదశ ప్రయోగాలు

టీకా వేయించుకోనున్న ప్రధాని


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని