Black Cat Commandos: భద్రత విధుల నుంచి తప్పుకోనున్న ‘బ్లాక్‌ క్యాట్‌’

దేశంలోని ప్రముఖుల భద్రత తీరుతెన్నులను కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మోదీ ప్రభుత్వం సమీక్షించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Published : 12 Jun 2024 06:15 IST

దిల్లీ: దేశంలోని ప్రముఖుల భద్రత తీరుతెన్నులను కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మోదీ ప్రభుత్వం సమీక్షించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడినట్లు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తగిన కసరత్తు చేపడుతోందని పేర్కొన్నాయి. ఇప్పటివరకూ వీఐపీలకు వ్యక్తిగత భద్రత విధుల్లో ఉన్న ఎన్‌ఎస్‌జీ కమెండోలతోపాటు ఐటీబీపీ సిబ్బందినీ ఉపసంహరించనున్నారు. ‘జడ్‌’ విభాగంలోని తొమ్మిది కేటగిరీల్లో ఉన్న వారి రక్షణ బాధ్యతలను సీఆర్పీఎఫ్‌కు లేదా సీఐఎస్‌ఎఫ్‌లోని స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌(ఎస్‌ఎస్‌జీ)కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఉగ్రదాడులు, విపత్తుల సందర్భంగా ‘స్ట్రైక్‌ ఫోర్స్‌’గా వినియోగించుకునేందుకు 1984లో ఎన్‌ఎస్‌జీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉండటంతో బ్లాక్‌ క్యాట్‌ కమెండోలను వీఐపీల బాధ్యతల నుంచి తప్పించాలని 2012లోనే ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం ముఖ్యుల భద్రతలో 450 మంది వరకు బ్లాక్‌క్యాట్‌ కమెండోలో ఉన్నారని సమాచారం. వారిని ఆ విధుల నుంచి ఉపసంహరించుకున్నాక.. దేశంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో బృందాల వారీగా మోహరించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని