CUET-PG 2022 Results: సీఈయూటీ (పీజీ) ఫలితాలు విడుదల

జాతీయ స్థాయిలో ప్రఖ్యాత యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇటీవల నిర్వహించిన కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌.....

Published : 26 Sep 2022 18:25 IST

దిల్లీ: జాతీయ స్థాయిలో ప్రఖ్యాత యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇటీవల నిర్వహించిన కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌- పోస్టుగ్రాడ్యుయేట్‌ (సీయూఈటీ పీజీ - 2022) పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) సోమవారం సాయంత్రం విడుదల చేసింది.  సెప్టెంబర్‌ 1 నుంచి 7వరకు, అలాగే, సెప్టెంబర్‌ 9నుంచి 12 తేదీల వరకు పలు విడతలుగా నిర్వహించిన ఈ పరీక్ష రాసేందుకు 6లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా.. దాదాపు 3.34లక్షల మందికి పైగా హాజరయ్యారు. 

దేశవ్యాప్తంగా 27 కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పాటు మొత్తం 66 వర్సిటీల్లో పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్షను 266 నగరాలు/పట్టణాల్లో ఏర్పాటు చేసిన 570 పరీక్షా కేంద్రాలతో పాటు విదేశాల్లోని నాలుగు నగరాల్లో నిర్వహించారు. సెప్టెంబర్‌ 24న తుది ఆన్సర్‌ కీని విడుదల చేశారు. ఆ కీని cuet.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అలాగే, విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాల లింక్‌పై క్లిక్‌ చేసి తమ రోల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు, సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా తమ స్కోర్‌ కార్డును పొందొచ్చని ఎన్‌టీఏ అధికారులు తెలిపారు.

 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని