CUET UG: ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి మళ్లీ పరీక్ష - ఎన్‌టీఏ

కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు CUET-UG పరీక్షకు సంబంధించి అభ్యర్థులు లేవనెత్తే ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి జులై 15 నుంచి 19 మధ్య కాలంలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) వెల్లడించింది.

Published : 08 Jul 2024 00:08 IST

దిల్లీ: కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు CUET-UG పరీక్షకు సంబంధించి అభ్యర్థులు లేవనెత్తే ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి జులై 15 నుంచి 19 మధ్య కాలంలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. పలు సాంకేతిక సమస్యలు, పరీక్షా సమయం కోల్పోవడం వంటి ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. మరోవైపు యూజీ ప్రవేశ పరీక్ష ‘కీ’ విడుదల చేసిన ఎన్‌టీఏ.. జులై 9 లోగా అభ్యంతరాలు తెలియజేయాలని సూచించింది.

మే 15వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రధాన నగరాల్లో పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 13.48 లక్షల మంది హాజరయ్యారు. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు జులై 9 లోగా ఆన్‌లైన్‌ ద్వారా తెలియజేయాలని ఎన్‌టీఏ వెల్లడించింది. అయితే, పరీక్షకు సంబంధించి జూన్‌ 30లోగా వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. వీటిపై నిపుణుల బృందం నిర్ణయం తీసుకుంటుందని, ఒకవేళ వారి ఫిర్యాదులు నిజమైనవని తేలితే వారికి మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని