Airports: 8 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య డబుల్‌!

ప్రధాని నరేంద్రమోదీ (Narendra modi) అధికారంలోకి వచ్చాక దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న విమానాశ్రయాల (Airports) సంఖ్య దాదాపు రెట్టింపైందని అధికార వర్గాలు తెలిపాయి. 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య 8 ఏళ్లలో 140కి పెరిగిందని పేర్కొన్నాయి.

Published : 11 Dec 2022 01:26 IST

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ (Narendra modi) అధికారంలోకి వచ్చాక దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న విమానాశ్రయాల (Airports) సంఖ్య దాదాపు రెట్టింపైందని అధికార వర్గాలు తెలిపాయి. 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య 8 ఏళ్లలో 140కి పెరిగిందని పేర్కొన్నాయి. రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్యను 220కి పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నాయి.  గోవాలో మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (mopa international airport) ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు. దీని ద్వారా గోవాలో రెండో విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. దీనివల్ల గోవాకు కనెక్టివిటీ మరింత పెరుగుతుంది.

దేశంలో ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు ప్రధాని మోదీ కృత నిశ్చయంతో ఉన్నారని, ఇందులో భాగంగానే ఈ మధ్య విమానాశ్రయాల శంకుస్థాపనలు చేయడంతో పాటు వరుస ప్రారంభోత్సవాలు చేస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది నవంబర్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని దొన్యి పోలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని, జులైలో దేవ్‌గఢ్‌ విమనాశ్రయాన్ని మోదీ ప్రారంభించారు. అలాగే గతేడాది ఉత్తర్‌ప్రదేశ్‌లోని జవార్‌ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. ఆదివారం ప్రారంభించబోయే విమానాశ్రయానికి సైతం ప్రధాని మోదీ 2016 నవంబర్‌లో శంకుస్థాపన చేశారని అధికారులు తెలిపారు. గోవాలో ప్రస్తుతం డబోలిమ్‌లో ఒక ఎయిర్‌పోర్ట్‌ ఉంది. దీనికి అదనంగా మోపాలో మరిన్ని అధునాతన సదుపాయాలతో విమానాశ్రయం అందుబాటులోకి రాబోతోంది. మోపా ఎయిర్‌పోర్ట్‌లో రాత్రివేళ పార్కింగ్‌ సదుపాయం, కార్గో టర్మినల్‌ సదుపాయం ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని