J&K: ఉగ్రవాద ఘటనలు బాగా తగ్గాయ్‌: కేంద్రం

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు బాగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వం  వెల్లడించింది. ఈ అంశంపై రాజ్యసభలో పలువురు ఎంపీలు ....

Published : 29 Jul 2021 00:08 IST

దిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు బాగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వం  వెల్లడించింది. ఈ అంశంపై రాజ్యసభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2019తో పోలిస్తే 2020లో ఉగ్రవాద ఘటనలో 59శాతం మేర తగ్గాయని తెలిపారు. అలాగే, గతేడాది జూన్‌తో పోలిస్తే 2021 జూన్‌ నాటికి 32శాతం మేర తగ్గినట్టు పేర్కొన్నారు.

కశ్మీర్‌లో అన్ని రకాల కార్యకలాపాలూ నడుస్తున్నాయన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో దుకాణాలు, వ్యాపార సముదాయాలు, ప్రజారవాణా, ప్రభుత్వ కార్యక్రమాలు, విద్యా, ఆరోగ్య సంస్థల కార్యకలాపాలన్నీ సాధారణంగానే కొనసాగుతున్నట్టు తెలిపారు.   ఉగ్రవాదులకు సహకరించేందుకు ప్రయత్నించే వారి కదలికలను భద్రతా బలగాలు కూడా నిశితంగా గమనిస్తున్నాయని, అలాంటివారిపై చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పన దిశగా విధానాలు అమలు చేస్తున్నట్టు కేంద్రమంత్రి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని