Nurses: దేశంలో ప్రతి వెయ్యి జనాభాకు ఉన్న నర్సులెందరో తెలుసా?

భారత నర్సింగ్‌ కౌన్సిల్‌ రికార్డ్స్‌ ప్రకారం.. దేశ వ్యాప్తంగా 33.41 లక్షల మంది రిజిస్టర్‌ అయిన నర్సింగ్‌ సిబ్బంది ఉన్నట్టు........

Published : 05 Apr 2022 18:49 IST

దిల్లీ: దేశంలో ప్రతి వెయ్యి మంది జనాభాకు 1.96 మంది నర్సులు ఉన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానంలో పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. భారత నర్సింగ్‌ కౌన్సిల్‌ రికార్డ్స్‌ ప్రకారం.. దేశ వ్యాప్తంగా 33.41 లక్షల మంది రిజిస్టర్‌ అయిన నర్సింగ్‌ సిబ్బంది ఉన్నట్టు మంత్రి వెల్లడించారు. వీరిలో 23,40,501 మంది రిజిస్టర్‌ అయిన నర్సులు, మంత్రసానులు ఉండగా.. 10,00,805 మంది నర్సింగ్ సహాయక సిబ్బంది ఉన్నారన్నారు. అలాగే, 56,854 మంది మహిళా ఆరోగ్య సందర్శకులు ఉన్నట్టు పేర్కొన్నారు. దేశంలో నర్సుల నిష్పత్తి 1000 మంది జనాభాకు 1.96గా ఉన్నట్టు తెలిపారు. 

మరోవైపు, దేశంలోని రాష్ట్ర వైద్య మండలిలు, జాతీయ వైద్య కమిషన్‌ తెలిపిన వివరాల ప్రకారం గతేడాది నవంబర్‌ నాటికి 13,01,319 మంది అల్లోపతి వైద్యులు ఉన్నారన్నారు. వైద్యులు, జనాభా నిష్పత్తి 1:834గా ఉన్నట్టు తెలిపారు. 5.65లక్షల మంది ఆయుష్‌ వైద్యులు ఉన్నారని తెలిపారు. వీరితో పాటు 2.89లక్షల మంది దంత వైద్యులు, 13లక్షల ఆరోగ్య సంరక్షణ సంబంధమైన నిపుణులు ఉన్నట్టు పేర్కొన్నారు. 2014లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ సీట్లు  51,348ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 89,875కి (75శాతం) పెరిగిందన్నారు. అలాగే, పీజీ సీట్లు కూడా 31,185 నుంచి 60,202కు (93శాతం) పెరిగినట్టు గణాంకాల్లో మంత్రి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని