
రాహుల్ గురించి ఒబామా ఏమన్నారంటే!
పుస్తకంలో సోనియా, మన్మోహన్ల ప్రస్తావన కూడా..
న్యూయార్క్: పని పూర్తిచేసి ఉపాధ్యాయుడి మెప్పును పొందాలని విద్యార్థి ఎలా ఆరాటపడతారో అలాంటిదే తప్పిస్తే ప్రావీణ్యం సంపాదించాలనే తపన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీలో లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. స్పష్టత గానీ, ధైర్యం గానీ ఆయనలో కనిపించదన్నారు. ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పేరుతో ఒబామా పుస్తకం రాశారు. దీనిలో ప్రపంచంలోని వివిధ దేశాల నేతల గురించి ప్రస్తావించారు. ఈ పుస్తకాన్ని ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రిక సమీక్షించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రస్తావన ఈ పుస్తకంలో ఉంది. ‘భావరహితంగా కనిపించే నిజాయతీపరుల’ గురించి ఒకచోట చెబుతూ వారిలో భారత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఒకరని అన్నారు. ఈ పుస్తకం ఈ నెల 17న మార్కెట్లోకి రానుంది. ఒబామా బాల్యం, రాజకీయ ప్రస్థానం గురించి దీనిలో రాశారు. 2010, 2015లలో ఆయన భారత్లో పర్యటించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.