Odisha: రోడ్డు ప్రమాదంలో ఒడిశా కొత్త సీఎం పీఏ దుర్మరణం

ఒడిశా ముఖ్యమంత్రిగా మంగళవారం ఎంపికైన మోహన్ చరణ్ మాఝీ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చందన్ కుమార్ మహాపాత్ర  రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

Published : 12 Jun 2024 17:43 IST

భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రిగా ఎంపికైన మోహన్ చరణ్ మాఝీ(Mohan charan Majhi) వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చందన్ కుమార్ మహాపాత్ర(Chandan Kumar) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనేశ్వర్‌లోని సిరిపూర్‌లో చందన్ కుమార్(31) బైక్‌పై వెళ్తుండగా వేగంగా దూసుకువచ్చిన కారు అతడిని వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడడంతో స్థానికులు దగ్గరలోని క్యాపిటల్ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే చందన్ కుమార్ మరణించినట్లుగా వైద్యులు పేర్కొన్నారు. వేగంగా వచ్చిన కారు మరో ఇద్దరు ద్విచక్ర వాహనదారులను, మరో కారును ఢీకొట్టిందని  ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. తన పీఏ మరణం గురించి తెలుసుకున్న మోహన్ చరణ్ మాఝీ మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు.

భారతీయ జనతా పార్టీ (భాజపా) మంగళవారం సీఎంగా తన పేరును ప్రకటించిన తర్వాత కియోంజర్ శాసనసభ్యుడు మోహన్ చరణ్ మాఝీ ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. బుధవారం నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు