Shutdown: ఒడిశాలో లాక్‌డౌన్‌ పొడిగింపు

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కొనసాగుతుండటంతో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. వైరస్‌ కట్టడే లక్ష్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ...

Updated : 18 May 2021 17:17 IST

భువనేశ్వర్‌: కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కొనసాగుతుండటంతో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. వైరస్‌ కట్టడే లక్ష్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను జూన్‌ 1వరకు కొనసాగించనున్నట్టు వెల్లడించింది. మే 5న ప్రకటించిన లాక్‌డౌన్‌ రేపటితో ముగియనుండటంతో దాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా ప్రకటించిన లాక్‌డౌన్‌ మే 19న ఉదయం 5గంటల నుంచి జూన్‌ 1వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. వారాంతాల్లో పూర్తి షట్‌డౌన్‌ ఉంటుందని, ఇది శుక్రవారం సాయంత్రం 6గంటలకు మొదలై సోమవారం ఉదయం 5గంటల వరకు అమలు చేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టంచేసింది.

 ఒడిశాలో మంగళవారం ఒక్కరోజే 10,321 కొత్త కేసులు, 22 మరణాలు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 6.33లక్షలకు పెరగ్గా.. మరణాలు 2357కి చేరాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1,04,539 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. కొత్తగా నమోదైన కొత్త కేసుల్లో ఖుర్దా జిల్లాలో అత్యధికంగా1566 కొత్త కేసులు రాగా.. సుందర్‌గఢ్‌లో 819, కటక్‌లో 731 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని