Odisha Train Accident: తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు: ఒడిశా పోలీసులు

ఒడిశా రైలు ప్రమాదానికి (Odisha Train Accident) సంబంధించి సామాజిక మాధ్యమాల్లో (Social Media) కొందరు వ్యక్తులు ప్రచారం చేసే మోసపూరిత సమాచారాన్ని నమ్మొద్దని ఒడిశా పోలీసులు (Odisha Police) యూజర్లను కోరారు.

Published : 04 Jun 2023 18:19 IST

భువనేశ్వర్‌: ఒడిశా రైలు ప్రమాదం (Osisha Train Accident)తో ఎంతో మంది కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అయితే, ఈ ఘటనపై కొందరు సామాజిక మాధ్యమాల్లో (Social Media) తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒడిశా పోలీసులు (Odisha Police) హెచ్చరించారు. ఈ మేరకు ఒడిశా పోలీసులు ఆదివారం ఒక ప్రకటన చేశారు. ‘‘బాలేశ్వర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్నారు. ఇది ఎంతో దురదృష్టకరం. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోంది. కాబట్టి, సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని ఎవరు నమ్మొద్దు. అనుచిత వ్యాఖ్యలు, మోసపూరిత సమాచారంపట్ల అప్రమత్తంగా ఉండాలని యూజర్లను కోరుతున్నాం. రైలు ప్రమాదానికి సంబంధించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, నకిలీ సమాచారం వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడతాం’’ అని ఒడిశా పోలీసులు ట్వీట్ చేశారు. 

ఒడిశా రైలు ప్రమాదానికి గల కారణాలను ఇవేనంటూ కొందరు నెటిజన్లు పోస్ట్‌లు చేయడంపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే, ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు వల్లే ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. మరోవైపు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇప్పటి వరకు 275 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. బాలేశ్వర్‌లో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించడమే లక్ష్యంగా సుమారు 1,000 మంది రైల్వే సిబ్బంది, ఏడు పాకెటింగ్‌ యంత్రాలు, భారీ రైల్వే క్రేన్‌, నాలుగు రోడ్‌ క్రేన్లు నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని