Odisha: 57వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ.. తీపి కబురు చెప్పిన సీఎం

ఒడిశాలో 57వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తన పుట్టినరోజు నాడు సీఎం  నవీన్‌ పట్నాయక్‌ తీపి కబురు వినిపించారు.

Published : 16 Oct 2022 01:28 IST

భువనేశ్వర్‌: ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఒడిశా ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 57వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్నట్లు ప్రకటించింది. తన 76 పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఈ ప్రకటన చేయడం విశేషం. అయితే, ఇకపై కాంట్రాక్టు నియామకాలను రద్దు చేయనున్నట్లు కూడా వెల్లడించారు. ప్రస్తుతం ఉన్నవారిని క్రమబద్ధీకరించనున్నామని, ఆపై ఈ విధానంలో భర్తీ ప్రక్రియను నిలిపివేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నోటిఫికేషన్‌ను ఆదివారం విడుదల చేయనున్నట్లు పట్నాయక్ వీడియో సందేశంలో తెలిపారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై ప్రతి ఏటా రూ.1300 కోట్ల అదనపు భారం పడనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని