
Omicron: బ్రిటన్‌లో ఒమిక్రాన్ ఉద్ధృతి.. 12కు చేరిన మరణాలు
లండన్: ప్రపంచదేశాలకు వణుకు పుట్టిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్.. బ్రిటన్‌ను హడలెత్తిసతోంది. ప్రపంచంలోనే అత్యధిక ఒమిక్రాన్ కేసులు అక్కడే నమోదవుతుండగా.. మరణాల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది. కొత్త వేరియంట్ కారణంగా ఇప్పటివరకు అక్కడ 12 మంది మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించారు. ఇక ఒమిక్రాన్‌తో 104 మంది ఆసుపత్రిలో చేరినట్లు పేర్కొన్నాయి.
గడిచిన 24 గంటల్లో బ్రిటన్‌లో 90వేల మందికి పైగా కొవిడ్ బారిన పడగా.. అందులో 12వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఆ దేశంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 37వేలు దాటడం గమనార్హం. ఇప్పటివరకు 12మంది ఒమిక్రాన్‌తో మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ వెల్లడించారు. దీంతో వైరస్ వ్యాప్తి నివారణకు మళ్లీ ఆంక్షలు విధించాలని బ్రిటన్ సర్కారు భావిస్తోంది. ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో అక్కడ బూస్టర్ డోసు పంపిణీని వేగవంతం చేశారు.
తొలిసారిగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్ ఇప్పటికే అనేక దేశాలకు పాకింది. అయితే ఐరోపా దేశాలతో పాటు అమెరికాలోనూ దీని విజృంభణ ఎక్కువగా ఉంది. అయితే మరణాలు మాత్రం ఇప్పటి వరకు ఒక్క బ్రిటన్‌లోనే నమోదవడం గమనార్హం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.