Omicron: ఒమిక్రాన్‌ వ్యాప్తి.. డెల్టాతో పోల్చితే 4.2 రెట్లు ఎక్కువే!

కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ ఒకవైపు ప్రపంచ దేశాలకు విస్తరిస్తుండగా.. మరోవైపు దాని వ్యాప్తి వేగం, తీవ్రత, టీకాల సమర్థతపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్థాయి పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా జపాన్‌ శాస్త్రవేత్త చేసిన ఓ అధ్యయనంలో...

Published : 09 Dec 2021 15:24 IST

జపాన్‌ శాస్త్రవేత్త అధ్యయనంలో వెల్లడి

టోక్యో: కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ ఒకవైపు ప్రపంచ దేశాలకు విస్తరిస్తుండగా.. మరోవైపు దాని వ్యాప్తి వేగం, తీవ్రత, టీకాల సమర్థతపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్థాయి పరిశోధనలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా జపాన్‌ శాస్త్రవేత్త చేసిన ఓ అధ్యయనంలో కొత్త అంశం వెల్లడైంది. ఒమిక్రాన్‌ ప్రారంభ దశలో.. డెల్టా వేరియంట్‌ కంటే 4.2 రెట్లు ఎక్కువ వేగంతో వ్యాపిస్తున్నట్లు తేలింది. క్యోటో విశ్వవిద్యాలయంలో ఆరోగ్య, పర్యావరణ శాస్త్రాల ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హిరోషి నిషియురా.. దక్షిణాఫ్రికా గౌటెంగ్ ప్రావిన్స్‌లో నవంబర్ వరకు అందుబాటులో ఉన్న జన్యు సమాచారాన్ని విశ్లేషించి, ఈ విషయాన్ని వెల్లడించారు.

‘రోగనిరోధక శక్తిని తప్పించుకుంటూ..’

‘ఒమిక్రాన్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. సహజ, వ్యాక్సిన్‌ల ద్వారా సమకూరిన రోగనిరోధక శక్తినీ ఇది తప్పించుకుంటుంది’ అని నిషియురా విశ్లేషించారు. ఈ సమాచారాన్ని ఆయన దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహా మండలికి సమర్పించారు. ఆరోగ్యశాఖకు సలహాదారుగా ఉన్న ఆయన.. గణిత సూత్రాల ఆధారంగా అంటువ్యాధుల వ్యాప్తి అంచనాలో నిపుణుడు. ‘దక్షిణాఫ్రికాలో టీకా రేటు 30 శాతం కంటే తక్కువగా ఉంది. దీంతో అక్కడ చాలా మందికి సహజంగానే వైరస్‌ సోకి ఉంటుంది. అయితే.. అధిక వ్యాక్సినేషన్‌ రేటు ఉన్న దేశాల్లోనూ ఇలాగే జరుగుతుందా? అని తేలేందుకు మరికొంత సమయం పడుతుందని నిషియురా చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని