
Omicron: ఒమిక్రాన్ ఉద్ధృతితో.. మరిన్ని ప్రమాదకర వేరియంట్లు..!
డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక
స్టాక్‌హోం: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో అన్ని దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో మరిన్ని కొత్త, అత్యంత ప్రమాదకర వేరియంట్లు ఉద్భవించే ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ.. దీని తీవ్రత భయపడినదానికంటే తక్కువగానే ఉంది. అయితే ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉండటంతో ఈ వేరియంట్ ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం కూడా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ సీనియర్ ఎమర్జెన్సీస్ ఆఫీసర్ కేథరిన్ స్మాల్‌వుడ్ హెచ్చరించారు. ‘‘ఒమిక్రాన్ ఎంత ఎక్కువ విస్తరిస్తే.. వ్యాప్తి అంత ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కొత్త, మరింత ప్రమాదకర వేరియంట్లు రూపాంతరం చెందే అవకాశం ఎక్కువగా ఉంది. డెల్టా కంటే తీవ్రత తక్కువే అయినప్పటికీ ఒమిక్రాన్ కూడా ప్రాణాంతకమే. మరి దీని తర్వాత వచ్చే వేరియంట్లు ఇంకా ఎలా ఉంటాయో ఎవరూ ఊహంచలేరు. ప్రస్తుతం మనమిప్పుడు అత్యంత ప్రమాదకర దశలో ఉన్నాం. ఇన్ఫెక్షన్ రేటు రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది. అందువల్ల ఒమిక్రాన్ ఉద్ధృతిని ఇప్పుడే పూర్తిగా అంచనా వేయలేం’’ అని కేథరిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఒమిక్రాన్ వ్యాప్తితో కరోనా మహమ్మారి మళ్లీ ప్రపంచంపై విరుచుకుపడుతోంది. దీని ధాటికి అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణుకుతోంది. అక్కడ ఒక్క రోజే 10లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవడం వైరస్ ఉద్ధృతికి అద్దంపడుతోంది. ఇక ఐరోపా దేశాల్లోనూ కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. యూకేలో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో 2లక్షలు దాటాయి. కొవిడ్ మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఐరోపాలో ఇప్పటివరకు 10కోట్ల మందికి పైగా మహమ్మారి బారినపడ్డారు. అమెరికాలో 5కోట్ల మందికి పైగా వైరస్ సోకింది.
ఒక్కో దేశంలో ఒక్కోలా ఒమిక్రాన్
కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుడు డాక్టర్ అబ్దీ మహముద్ మంగళవారం పేర్కొన్నారు. ఈ వేరియంట్ తొలిసారి బయటపడిన దక్షిణాఫ్రికాలో ఆసుపత్రిపాలయ్యే పరిస్థితి, మరణాల రేటు తక్కువగానే ఉందన్నారు. అయితే అన్నిచోట్ల ఇదే తరహాలో ఉంటుందని భావించలేమని చెప్పారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ బారిన పడినవారిలో ఆసుపత్రుల పాలు కావడం చాలా తక్కువని, మరణాలు చాలా చాలా తక్కువని తెలిపారు. అయితే ఇతర దేశాల్లోనూ ఇలాగే ఉంటుందని భావించలేమన్నారు. గతంలో ఎన్నడూలేనంతగా ఒమిక్రాన్‌లో సాంక్రమికశక్తి కనిపిస్తోందని చెప్పారు. అమెరికాలో కేసులు గణనీయంగా పెరుగుతున్న విషయాన్ని ఆయన ఉటంకించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Nupur Sharma: అధికార పార్టీ సిగ్గుతో తల దించుకోవాలి : కాంగ్రెస్
-
Sports News
IND vs ENG: ఆదుకున్నపంత్, జడేజా.. తొలిరోజు ముగిసిన ఆట
-
India News
Presidential Election: రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మూ గెలుపు ఖాయమే..! మమతా బెనర్జీ
-
General News
Chile: సాధారణ ఉద్యోగి ఖాతాలో కోటిన్నర జీతం.. రాజీనామా చేసి పరార్!
-
Movies News
The Warriorr: తెలుగు కమర్షియల్ హిట్ చిత్రాలకు ఆయనే స్ఫూర్తి: రామ్
-
India News
Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!
- IND vs ENG: ఆదుకున్నపంత్, జడేజా.. తొలిరోజు ముగిసిన ఆట
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య
- Presidential Election: రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మూ గెలుపు ఖాయమే..! మమతా బెనర్జీ
- Pakistan: అగ్ర దేశాలకు ‘డంపింగ్ యార్డు’గా మారిన పాకిస్థాన్!
- Ketaki Chitale: పోలీసులు నన్ను వేధించారు.. కొట్టారు: కేతకి చితాలే
- Chile: సాధారణ ఉద్యోగి ఖాతాలో కోటిన్నర జీతం.. రాజీనామా చేసి పరార్!
- Meena: అసత్య ప్రచారం ఆపండి.. మీనా భావోద్వేగ లేఖ
- Single-Use Plastic: సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా