Viral news: దొంగ...పోలీస్‌..పరుగో పరుగు..వీడియో వైరల్‌!

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సినిమాను తలపించే సన్నివేశం చోటు చేసుకుంది. నేరస్తులకు పోలీసులు ఎదురవ్వడంతో.. కారు డోరు తీసి వాళ్లు పరుగులు పెట్టారు.వారిని పట్టుకునేందుకు పోలీసులు కూడా పరుగెత్తారు. దీనికి బంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Published : 02 Dec 2022 01:34 IST

అమృత్‌సర్‌: ఓ కారులో నేరస్థులు రయ్‌ మంటూ దూసుకొచ్చారు.. వారికి ఎదురుగా పోలీసులు మరో వాహనంలో సర్‌ర్‌ మంటూ వచ్చారు. రెండు వాహనాలు దాదాపు మీటరు దూరంలో ఆగాయి. అంతే.. నేరస్తులు కారు డోరు తీసి పరుగు తీశారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు కూడా కాళ్లకి పని చెప్పారు. అచ్చం సినిమా సన్నివేశాన్ని తలపించే ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో చోటు చేసుకుంది. ఈ తతంగమంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీకెమెరాల్లో నిక్షిప్తమైంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. చివరికి ఇద్దరు దుండగులను పట్టుకున్నట్లు అమృత్‌సర్‌ పోలిస్‌కమిషనర్‌ జస్‌కరణ్‌ సింగ్‌ తెలిపారు. వీరిద్దరూ దాదాపు ఐదారు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు  చెప్పారు. వారి నుంచి ఐదు ఆయుధాలతోపాటు గన్‌లో ఉపయోగించే క్యాట్రిజ్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని