
Gandhi Jayanti: మహాత్ముడి స్ఫూర్తిబాట.. అతిపెద్ద మువ్వన్నెల జెండా ఆవిష్కరణ
లద్ధాఖ్: నేడు మహాత్ముడి జయంతిని దేశమంతా ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర పాలిత ప్రాంతమైన లద్ధాఖ్‌లో ఖాదీ వస్త్రంతో రూపొందించిన ప్రపంచంలోనే అతిపెద్ద మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. లేహ్‌లోని పర్వత ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ భారీ జాతీయ పతాకాన్ని లద్ధాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్.కె.మాథూర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు జెండా వందనం సమర్పించారు. అనంతరం సైన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
స్వదేశీ నినాదంలో భాగంగా గాంధీ ‘ఖాదీ’కి విశేష ప్రాధాన్యం ఇచ్చిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య పోరాటంలో బాపు సారథ్యంలోని ‘ఖద్దరు ఉద్యమం’ కీలక పోషించింది. ఈ క్రమంలోనే గాంధీ ఆశయ బాటలో సాగాలని మరోసారి గుర్తుచేస్తూ ఈ జెండాను ఆవిష్కరించడం విశేషం. ఈ త్రివర్ణ పతాకం పొడవు 225 అడుగుల కాగ, వెడల్పు 150 అడుగులు. వెయ్యి కిలోల బరువు ఉంది. భారత సైన్యానికి చెందిన 57 ఇంజినీర్ రెజిమెంట్ దీన్ని ఏర్పాటు చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.