Nitish kumar: 10లక్షలు కాదు.. 20లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం‌: నీతీశ్‌

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ బిహార్‌ ప్రజలకు సీఎం నీతీశ్‌ కుమార్‌ (Nitish kumar) శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో 20లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ కొత్త ......

Published : 16 Aug 2022 01:47 IST

పట్నా: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ బిహార్‌ ప్రజలకు సీఎం నీతీశ్‌ కుమార్‌ (Nitish kumar) శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో 20లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ కొత్త ప్రభుత్వం లక్ష్యమని ప్రకటించారు. ఇటీవల డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ చెప్పినట్టుగా 10లక్షల ఉద్యోగాలు ఇవ్వడం మాత్రమే తమ లక్ష్యం కాదని.. అంతకు రెట్టింపు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేయనున్నట్టు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా నీతీశ్‌ మాట్లాడుతూ.. ఆర్జేడీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశామని.. అధికారంలోకి వస్తే 10లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ 2020 ఎన్నికల సమయంలో తేజస్వీయాదవ్‌ ఇచ్చిన హామీని గుర్తు చేశారు. అయితే, తేజస్వీ హామీ ఇచ్చినట్టు 10లక్షల ఉద్యోగాలు కాదని.. ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో 20లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేయనున్నట్టు చెప్పారు. నీతీశ్‌ ప్రకటన పట్ల డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ హర్షం ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున సీఎం నీతీశ్‌ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైందిగా కొనియాడారు. ప్రస్తుతం ఉద్యోగాలు కల్పించడం కన్నా పెద్ద విషయం ఇంకేదీ లేదన్నారు. తాను గతంలో ఇచ్చిన వాగ్దానం ఏమైందని ప్రశ్నిస్తున్నవారి నోరు మూతపడుతుందని  తేజస్వీ వ్యాఖ్యానించారు.

గత వారం బిహార్‌లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భాజపాతో తెగదెంపులు చేసుకున్న నీతీశ్‌కుమార్‌.. బయటకు వచ్చి ఆర్జేడీ-కాంగ్రెస్‌-లెఫ్ట్‌ సారథ్యంలోని మహాకూటమితో జట్టుకట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. నీతీశ్‌ ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ రెండోసారి డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని