AstraZeneca: ‘ఆస్ట్రాజెనెకా బూస్టర్‌ డోసుతో ఒమిక్రాన్‌ కట్టడి’

ఒమిక్రాన్‌ కట్టడిలో బూస్టర్‌ డోసులూ కీలక పాత్ర పోషిస్తాయని ఆయా అధ్యయనాలు చెబుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఫార్మాసంస్థ ‘ఆస్ట్రాజెనెకా’ ఈ విషయమై కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రాజెనెకా టీకా(యూరప్‌లో వాక్స్‌జెవ్రియా) మూడు డోసుల కోర్సు ఒమిక్రాన్‌పై...

Updated : 24 Dec 2021 11:38 IST

లండన్‌: ఒమిక్రాన్‌ కట్టడిలో బూస్టర్‌ డోసులూ కీలక పాత్ర పోషిస్తాయని ఆయా అధ్యయనాలు చెబుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఫార్మాసంస్థ ‘ఆస్ట్రాజెనెకా’ ఈ విషయమై కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రాజెనెకా టీకా(యూరప్‌లో వాక్స్‌జెవ్రియా) మూడు డోసుల కోర్సు ఒమిక్రాన్‌పై ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అధ్యయనంలో తేలిందని వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధకుల ల్యాబ్‌ డేటాను ఉటంకిస్తూ గురువారం ఈ ప్రకటన చేసింది. కొవిడ్‌ సోకి, సహజంగా కోలుకున్నవారితో పోల్చితే.. ఆస్ట్రాజెనెకా బూస్టర్ డోసు తీసుకున్నవారిలో ఒమిక్రాన్‌ను కట్టడి చేసే యాంటీబాడీ లెవల్స్‌ ఎక్కువగా ఉన్నట్లు తేలినట్లు చెప్పింది.

రెండు డోసుల తర్వాత డెల్టాను నిరోధించే యాంటీబాడీల స్థాయిలు ఏవిధంగా ఉన్నాయో.. మూడో డోసు తర్వాత ఒమిక్రాన్‌ను నిరోధించే యాంటీబాడీలు అదే స్థాయిలో ఉన్నాయని సంస్థ తెలిపింది. ఆక్స్‌ఫర్డ్ పరిశోధకులు.. ఈ టీకాను అభివృద్ధి చేసినవారితో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఈ అధ్యయనం చేశారని పేర్కొంది. ఇటీవల మోడెర్నా సైతం తమ మూడో డోసు.. ఒమిక్రాన్‌ను సమర్థంగా నిలువరించగలదని ప్రకటించిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని