Gyanvapi mosque case: ‘జ్ఞానవాపి’ కేసు..యథాతథ స్థితిని కొనసాగించండి: సుప్రీం
జ్ఞానవాపి మసీదులో శివలింగం కనిపించిందంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలంటూ గతంలో జారీ చేసిన ఆదేశాలను పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది.
దిల్లీ: వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మసీదులో శివలింగం కనిపించిందంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలంటూ గతంలో జారీ చేసిన ఆదేశాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మే నెలలో జారీ చేసిన ఆదేశాలు రేపటితో ముగియనున్న నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. శివలింగం కనిపించిందంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు మే నెలలో వారణాసి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ ప్రార్థనా స్థలంలో ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి, మతపరమైన ఆచారాలు పాటించడానికి అనుమతినిచ్చింది. ఈ అంశానికి సంబంధించి వారణాసి కోర్టులో జరుగుతున్న విచారణపై స్టే విధించడానికి మాత్రం నిరాకరించింది. మరోవైపు జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని శృంగార గౌరి విగ్రహానికి పూజలు నిర్వహించే అంశంపై ఐదుగురు హిందూ మహిళలు వేసిన పిటిషన్‌పై ఈ నెల 8న విచారణ చేపట్టిన వారణాసి కోర్టు తదుపరి విచారణను నవంబరు 14కి వాయిదా వేసింది.
ఇంతకీ ఏం జరిగింది?
జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏప్రిల్‌లో కొందరు హిందూ మహిళలు దాఖలుచేసిన పిటిషన్ మేరకు వారణాసి కోర్టు.. ఆ ప్రార్థనా స్థలంలో గతంలో వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశించింది. సర్వే కొనసాగుతుండగా అక్కడ శివలింగం కనిపించిందంటూ హిందూ పక్షం వేసిన పిటిషన్‌పై స్పందించిన న్యాయమూర్తి ఆ ప్రదేశాన్ని సీల్ చేయాలని, సీఆర్పీఎఫ్ భద్రతలో ఉంచాలని ఉత్తర్వులిచ్చారు. జ్ఞానవాపి అంశంలో వారణాసి కోర్టు ఆదేశాలు చట్టవిరుద్ధమని, అక్కడ జరుగుతున్న విచారణపై స్టే విధించాలంటూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వాది, ప్రతివాదుల హక్కుల మధ్య సమతూకాన్ని పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కేసు సున్నితత్వం దృష్ట్యా 25-30 సంవత్సరాల అనుభవమున్న సీనియర్ జడ్జితో విచారణ చేపట్టాలని ఆదేశిస్తూ కేసును వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!
-
Movies News
Shah Rukh Khan: షారుక్‌ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!
-
World News
Rishi Sunak: సునాక్ మీరు బిలియనీరా..? బ్రిటన్ ప్రధాని సమాధానమిదే..