Priyanka Gandhi: రాహుల్‌ గాంధీ గురించి ప్రియాంక స్వీట్‌ పోస్ట్‌

అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవం (International Siblings Day) సందర్భంగా ప్రియాంక గాంధీ.. తన సోదరుడు రాహుల్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. 

Published : 10 Apr 2023 22:06 IST

దిల్లీ: అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవం (International Siblings Day) సందర్భంగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తన సోదరుడు రాహుల్‌ గాంధీతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అందులో రాహుల్‌ తన సోదరి భుజంపై చేయి వేసి మంచులో నడుస్తున్నట్లుంది. ‘ఎంతో మంది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నా.. మంచితనం కోసం నిలబడే ధైర్యం ఉన్న వారు, ప్రత్యర్థులు అణగదొక్కాలని చూసినా.. అన్యాయాన్ని ఎదుర్కొనేవారు, ఎల్లప్పుడూ నిజాన్ని మాట్లాడే వ్యక్తి నా సోదరుడు’ అని ప్రియాంక గాంధీ తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో రాసుకొచ్చారు. నేను మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను అంటూ పోస్ట్‌ చివరిలో హార్ట్‌ని కూడా జత చేశారు. తోబుట్టువుల దినోత్సవం మొట్టమొదట 1995లో ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. 1998 నుంచి అమెరికాలోని 39 రాష్ట్రాల గవర్నర్లు అధికారికంగా తోబుట్టువుల దినోత్సవాన్ని ఒక సంప్రదాయంగా గుర్తించారు. నేషనల్ సిబ్లింగ్స్ డే  పేరిట ఇవాళ అక్కడ సెలవుదినంగా ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని