Puri Ratha yatra: పూరీ రథయాత్రలో అపశ్రుతి.. ఒకరి మృతి

ఒడిశాలోని పూరీలో విశ్వప్రసిద్ధ జగన్నాథుడి రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది

Published : 07 Jul 2024 21:19 IST

పూరీ: ఒడిశాలోని పూరీలో విశ్వప్రసిద్ధ జగన్నాథుడి రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. రథం లాగుతుండగా తోపులాట జరగడంతో ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. దాదాపు 300 మందికిపైగా స్వల్పగాయలైనట్లు సమాచారం. గాయాలపాలైన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌ రథాలపై చెరాపహరా (బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చడం) పూర్తి చేశారు. సాయంత్రం 4 గంటలకు రథాలకు సారథులు, అశ్వాలు అమర్చి తాళ్లు కట్టారు. అనంతరం బలభద్రుని తాళధ్వజ రథం ముందుకు కదిలింది. ఆ తర్వాత కొద్ది సేపటికే భక్తుల మధ్య తోపులాట జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని