ONGC: అరేబియా సముద్రంపై ఓఎన్‌జీసీ హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌..

ఆయిల్ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ)కి చెందిన ఓ హెలికాప్టర్‌ ఒకటి అరేబియా సముద్రంపై అత్యవసరంగా దిగింది. అందులో ఆరుగురి సిబ్బందిని కాపడగా.. మిగతా వారిని రక్షించేందుకు

Updated : 28 Jun 2022 14:37 IST

ముంబయి: ఆయిల్ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ)కి చెందిన హెలికాప్టర్‌ ఒకటి అరేబియా సముద్రంపై అత్యవసరంగా దిగింది. అందులో ఆరుగురు సిబ్బందిని కాపాడగా.. మిగతా వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఓఎన్‌జీసీకి చెందిన ఆరుగురు సిబ్బంది, ఒక కాంట్రాక్టర్‌, ఇద్దరు పైలట్లతో వెళ్తోన్న హెలికాప్టర్‌ ఒకటి ఓఎన్‌జీసీ రిగ్‌కు సమీపంలో అరేబియా సముద్రంపై అత్యవసరంగా ల్యాండ్‌ అయినట్లు కంపెనీ ట్విటర్‌లో వెల్లడించింది. హెలికాప్టర్‌కు ఉన్న ఫ్లోటర్ల సాయంతో దిగినట్లు తెలిపింది. సమాచారం తెలియగానే, ఓఎన్‌జీసీ సహాయక చర్యలు చేపట్టింది. రిగ్‌ నుంచి సహాయక బోట్లను పంపించింది. అటు భారత తీర దళం కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో చేరింది.

హెలికాప్టర్‌లో ఉన్న 9 మందిని కాపాడినట్లు ఓఎన్‌జీసీ తెలిపింది. అయితే హెలికాప్టర్‌ ఎందుకు అత్యవసరంగా ల్యాండ్‌ అవ్వాల్సి వచ్చిందన్న వివరాలపై మాత్రం స్పష్టత లేదు. అరేబియా సముద్రంలో ఉన్న నిల్వల నుంచి చమురు, గ్యాస్‌ను ఉత్పత్తి చేసేందుకు ఓఎన్‌జీసీ ఈ సముద్రంలోనే అనేక రిగ్‌లు, ఇన్‌స్టాలేషన్లను ఏర్పాటు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని