Southern Railway: రైళ్లలో ప్రయాణించాలంటే.. టీకా సర్టిఫికెట్ తప్పనిసరి!

తమిళనాడులో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో దక్షిణ రైల్వే కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నవారికి మాత్రమే రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిస్తామని......

Updated : 08 Jan 2022 20:30 IST

చెన్నై: తమిళనాడులో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో దక్షిణ రైల్వే కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నవారికి మాత్రమే చెన్నై లోకల్‌ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిస్తామని వెల్లడించింది. కౌంటర్​ వద్ద కొవిడ్ వ్యాక్సినేషన్​ సర్టిఫికెట్ చూపించినవారికే టికెట్​ అందిస్తామని అధికారులు ఈ మేరకు స్పష్టం చేశారు. జనవరి 10 నుంచి 31వ తేదీ వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అంతేకాక దక్షిణ జోన్​లోని రైల్వేస్టేషన్​ ప్రాంతాల్లో మాస్కు లేకుండా కనిపిస్తే రూ. 500 జరిమానా విధిస్తామని రైల్వే జోన్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణికులు కొవిడ్ నిబంధనలను తప్పక పాటించాలని సూచించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా దక్షిణ రైల్వే​.. జనవరి 6 నుంచే పలు రకాల ఆంక్షలను విధిస్తూ వస్తోంది. రైళ్లను 50 శాతం సీటింగ్ సామర్థ్యంతోనే నడుపుతోంది.

గడిచిన 24 గంటల్లో తమిళనాడులో కొత్తగా 8,981 మందికి పాజిటివ్‌గా తేలింది. మహమ్మారితో మరో 8 మంది మృతిచెందారు. కాగా మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 27,76,413కు చేరింది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 36,833కు చేరింది. తమిళనాడులో ఇప్పటివరకు 121 మందికి ఒమిక్రాన్‌గా నిర్ధరణ అయింది. ఇందులో 117 మంది కోలుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని