రామ మందిర్‌ ట్రస్ట్‌పై విపక్షాల అవినీతి ఆరోపణలు

రామ మందిర నిర్మాణ బాధ్యతలు చూస్తున్న రామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌పై విపక్షాలు అవినీతి ఆరోపణలు చేశాయి. భూమి కొనుగోలు వ్యవహారంలో ట్రస్ట్‌ సభ్యులు.

Updated : 07 Jul 2021 16:48 IST

లఖ్‌నవూ: రామ మందిర నిర్మాణ బాధ్యతలు చూస్తున్న రామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌పై విపక్షాలు అవినీతి ఆరోపణలు చేశాయి. భూమి కొనుగోలు వ్యవహారంలో ట్రస్ట్‌ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌, సమాజ్‌ వాదీ పార్టీ నేత పవన్‌ పాండే ఆరోపించారు. ఈ మేరకు  ఆదివారం వేర్వేరుగా విలేకరుల సమావేశాల్లో పాల్గొని ఈ ఆరోపణలు చేశారు. 

రెండు కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ రూ.18.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసిందని సంజయ్‌ సింగ్‌ ఆరోపించారు. కుసుమ్‌, హరీశ్‌ పాఠక్‌ అనే వ్యక్తుల నుంచి రవి మోహన్‌, సుల్తాన్‌ అన్సారీ ఆ భూమిని రూ.2 కోట్లకు కొనుగోలు చేశారని, అది జరిగిన ఐదు నిమిషాలకే వారి నుంచి ట్రస్ట్‌ కొనుగోలు చేసిందని వివరించారు. ఇందుకోసం రూ.₹16.5 కోట్లు అదనంగా చెల్లించినట్లు ఆరోపించారు. రెండు లావాదేవీలకు ట్రస్ట్‌ సభ్యుడు అనిల్‌ మిశ్రా, అయోధ్య మేయర్‌ రిషికేశ్‌ ఉపాధ్యాయ సాక్షులుగా వ్యవహరించారని పేర్కొన్నారు.

ఎస్పీ నేత పవన్‌ పాండే సైతం ఇలాంటి ఆరోపణలే చేశారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలో భూమి విలువ 10 రెట్లు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని కోరారు. ఆప్‌, ఎస్పీ చేసిన ఆరోపణలపై వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడు, రామ మందిర్‌ ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ స్పందించారు. ఇలాంటి ఆరోపణలను తాము పట్టించుకోబోమన్నారు. గత వందేళ్లుగా ఇలాంటి ఆరోపణలను చేస్తూనే వస్తున్నారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని