Train Collision: రీల్స్ చేయడంలో రైల్వే మంత్రి బిజీ: కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

Train Collision: పశ్చిమ్ బెంగాల్‌లో కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను ఓ గూడ్స్‌ రైలు ఢీ కొట్టిన ఘటన నేపథ్యంలో రైల్వేమంత్రిపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

Published : 17 Jun 2024 18:15 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ (West Bengal)లోని దార్జీలింగ్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం(Train Collision)పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మంత్రి రీల్స్‌ చేయడంలో బిజీగా ఉన్నారని, ప్రజల భద్రత గురించి చర్చించడానికి ఆయనకు సమయం లేదని కాంగ్రెస్ దుయ్యబట్టింది.

‘‘గత పదేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం రైల్వేశాఖను పూర్తిగా దుర్వినియోగం చేసింది. తప్పులు చేయవద్దు. మా ప్రశ్నలు నిరంతరం మీపై దూసుకువస్తూనే ఉంటాయి. రైల్వేకి ఈ పరిస్థితికి తీసుకువచ్చినందుకు కేంద్ర పభుత్వాన్ని జవాబుదారీ చేస్తాం’’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఈ రైలు ప్రమాదాల వెనక ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలే ఉన్నాయి. ట్రాక్స్‌పై భారం పెరుగుతోంది కానీ, భద్రతాపరమైన చర్యల విషయంలో ఎలాంటి శ్రద్ధా లేదు. ఒడిశా రైలు దుర్ఘటనను ఇంకా పూర్తిగా మరువకముందే.. మరో భారీ ప్రమాదం జరిగింది. ఈ శాఖను నిర్వహించలేకపోతున్న మంత్రి వెంటనే రాజీనామా చేయాలి’’ అని కాంగ్రెస్ నేత ప్రమోద్‌ తివారీ మండిపడ్డారు.

Train Collision:: ఘోర ప్రమాదం: రెండు రైళ్లు ఢీ.. గాల్లోకి లేచిన బోగీ?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని