Fuel price hike: ;పెట్రో ధరలు.. ఇక ప్రతిరోజూ వికాసమే..!

దాదాపు ఐదు నెలల తర్వాత దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరిగాయి. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడంతో.. ఈ పెంపు చోటుచేసుకుంది.

Published : 22 Mar 2022 23:49 IST

దిల్లీ: దాదాపు ఐదు నెలల తర్వాత దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరిగాయి. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడంతో.. ఈ పెంపు చోటుచేసుకుంది. రానున్న రోజుల్లో ఈ పెరుగుదల కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఈ మార్పు చోటుచేసుకోవడంపై కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

* ఎన్నికలు ముగిశాయి. సామాన్యుడిపై బాదుడు మొదలైంది... కాంగ్రెస్‌

ఎల్‌పీజీ సిలిండర్ విషయంలో తన లక్ష్యం (ఒక్కో సిలిండర్ రూ.1,000) చేరుకున్న ప్రధాని మోదీకి నా అభినందనలు. ఇకనుంచి ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరల్లో వికాసం కనిపిస్తుంది. ఆయన ప్రభుత్వం ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్నవి మతతత్వం, ద్వేషం మాత్రమే. మిగతావన్నీ ఖరీదైనవి... కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే     

భాజపాతో భారీ ద్రవ్యోల్బణం. గ్యాస్‌ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. ప్రజలు ఆ పాత రోజులు కావాలంటున్నారు. మోదీజీ నుంచి అచ్చేదిన్ వద్దంటున్నారు... కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా 

ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయని అఖిలేశ్ యాదవ్ పదేపదే చెప్పారు. వారికి ఎవరు అధికారం కట్టబెట్టారో తెలీదు... ఎస్పీ నేత జయాబచ్చన్ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని