
Parliament: పార్లమెంట్‌లో చమురు ధరల సెగ.. ప్రతిపక్షాల వాకౌట్
దిల్లీ: చమురు, వంట గ్యాస్ ధరల పెంపుపై ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయసభలు మంగళవారం దద్దరిల్లాయి. ఈ ఉదయం ప్రశ్నోత్తరాల గంట పూర్తికాగానే కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి చమురు ధరల అంశాన్ని లేవనెత్తారు. ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతారని ప్రతిపక్ష పార్టీలు ఎప్పటి నుంచో చెబుతున్నాయని, ఇప్పుడు అదే జరిగిందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ధరల పెంపునకు నిరసగా కాంగ్రెస్, తృణమూల్, ఎన్సీపీ, డీఎంకే, వామపక్ష పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. విపక్షాలు మాట్లేందుకు స్పీకర్ అనుమతినివ్వకపోవడంతో ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.
రాజ్యసభలో వాయిదాల పర్వం..
అటు రాజ్యసభలోనూ ఇదే గందరగోళం తలెత్తింది. ఈ ఉదయం పెద్దల సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు చమురు ధరలపై ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఛైర్మన్ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు ప్రారంభమైనా.. అదే పరిస్థితి పునరావృతమైంది. టీఎంసీ, కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులు చేతబట్టి వెల్‌లోకి దూసుకెళ్లగా.. ఇతర ప్రతిపక్ష సభ్యులు టేబుళ్లపై నిల్చుని నిరసన చేపట్టారు. డిప్యూటీ ఛైర్మన్ వారించినా సభ్యులు వెనక్కి తగగ్లేదు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
దాదాపు ఐదు నెలల తర్వాత చమురు ధరలను మంగళవారం పెంచారు. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 80 పైసల చొప్పున పెంపు ఉంటుందని చమురు సంస్థలు నేడు ప్రకటించాయి. ఇక వంటగ్యాస్ సిలిండర్ ధరను కూడా రూ.50 పెంచుతున్నట్లు వెల్లడించాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
-
Ap-top-news News
Andhra News: 10.30కి వివాదం.. 8 గంటలకే కేసు!
-
Ap-top-news News
Margani Bharat Ram: ఎంపీ సెల్‌ఫోన్ మిస్సింగ్‌పై వివాదం
-
Ap-top-news News
Andhra News: ప్రభుత్వ బడిలో ఐఏఎస్ పిల్లలు
-
Ts-top-news News
Heavy Rains: నేడు, రేపు అతి భారీ వర్షాలు
-
Ap-top-news News
Dadisetti Raja: నచ్చకపోతే వాలంటీర్లను తీసేయండి: మంత్రి రాజా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- రూ.19 వేల కోట్ల కోత
- Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా