ECI: మన ఈసీ ఇతర దేశాలకు బెంచ్ మార్క్‌ నిర్దేశించింది: మోదీ

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సంఘం(ఈసీ) పనితీరును అభినందించారు.

Published : 25 Jan 2022 15:14 IST

దిల్లీ: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సంఘం (ఈసీ) పనితీరును అభినందించారు. వ్యక్తులకు నోటీసులు జారీచేయగల, అధికారులను బదిలీ చేయగల ఎన్నికల సంఘాలు ఉన్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటని ప్రశంసించారు. దీని పనితీరు, ఎన్నికల ప్రక్రియ పలు దేశాలకు ప్రమాణాలను నిర్దేశించిందన్నారు.

కొత్త ఓటర్లకు పోస్టు ద్వారా కార్డులు..

కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లకు ఇలుస్ట్రేటెడ్ ఎలక్టోర్‌ ఫోటో గుర్తింపు కార్డు (ఈపీఐసీ)లను పోస్ట్ ద్వారా పంపాలని భారత ఎన్నికల సంఘం (ఈసీ)నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం సీనియర్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.

‘జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా.. ఓటరు కార్డులను పోస్టు ద్వారా నేరుగా గ్రహీతలకు పంపే విధానాన్ని నేటి నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నాం’ అని ఆ అధికారి వెల్లడించారు. అలాగే కార్డులతో పాటు ఎన్నికల సంఘం ఒక కిట్‌ కూడా పంపుతుందన్నారు. ఆ కిట్‌లో ఈవీఎం, ఓటింగ్ విధానకు సంబంధించిన సమాచారం ఉంటుందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని