Covid vaccine: రాష్ట్రాల వద్ద 1.19కోట్లకుపైగా డోసులు

రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం 1.19కోట్లకు పైగా కరోనా టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని మంగళవారం కేంద్రం వెల్లడించింది.

Published : 08 Jun 2021 22:04 IST

వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ

దిల్లీ: రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం 1.19కోట్లకు పైగా కరోనా టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని మంగళవారం కేంద్రం వెల్లడించింది. అలాగే ఇప్పటివరకు 24కోట్లకు పైగా డోసులను సరఫరా చేయగా.. 23,47,43,489 టీకాలు ప్రజలకు అందినట్లు పేర్కొంది. అందులో వృథా అయిన డోసుల సంఖ్య కూడా కలిసే ఉన్నట్లు చెప్పింది. 

‘దేశవ్యాప్తంగా నడుస్తోన్న కరోనా టీకా కార్యక్రమం కింద రాష్ట్రాలకు కేంద్రం ఉచితంగా టీకాలు అందజేస్తోంది. అలాగే అవి నేరుగా టీకాలు సేకరించేందుకు సదుపాయం కల్పిస్తోంది. ప్రస్తుతం వాటి వద్ద 1,19,46,925 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయి’ అని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి 16న దేశవ్యాప్తంగా కరోనా టీకా కార్యక్రమం ప్రారంభమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని