vaccine: రాష్ట్రాల వద్ద 1.60 కోట్ల డోసులు

కరోనా వైరస్‌ నియంత్రణకు దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. కొవిడ్‌పై పోరాటంలో భాగంగా జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభించారు. దేశంలో ప్రస్తుతం కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు అందుబాటులో ఉన్నాయి.

Published : 22 May 2021 23:56 IST

వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ

దిల్లీ: కరోనా వైరస్‌ నియంత్రణకు దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. కొవిడ్‌పై పోరాటంలో భాగంగా జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభించారు. దేశంలో ప్రస్తుతం కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రాలకు 20 కోట్లకు పైగా డోసులను కేంద్రం ఉచితంగా అందించింది. మే 21 నాటికి వాటిలో 19,73,61,311 టీకాలను రాష్ట్రాలు వినియోగించాయని కేంద్రం వెల్లడించింది. మరో 1.60 కోట్ల (1,60,13,409) డోసులు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో ఉన్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. మరో మూడురోజుల్లో 2.67 లక్షల డోసులను రాష్ట్రాలకు పంపనున్నట్లు వెల్లడించింది.

నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 20.66 లక్షల కరోనా టెస్టులు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వారిలో 2,57,299 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 29,23,400కు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని