Vaccination: రాష్ట్రాల్లో 15.69 కోట్లకుపైగా టీకా నిల్వలు

విడ్‌ డోసుల పంపిణీలో ఇప్పటికే వంద కోట్ల మైలురాయి అందుకున్న భారత్‌లో.. శనివారానికి ఈ సంఖ్య 108 కోట్లు దాటింది. ఇందులో 74.09 కోట్లు మొదటి డోసు కాగ, 34.13 కోట్లు రెండో డోసుకు సంబంధించినవి. 

Published : 07 Nov 2021 00:17 IST

దిల్లీ: కొవిడ్‌ డోసుల పంపిణీలో ఇప్పటికే వంద కోట్ల మైలురాయి అందుకున్న భారత్‌లో.. శనివారానికి ఈ సంఖ్య 108 కోట్లు దాటింది. ఇందులో 74.09 కోట్లు మొదటి డోసు కాగ, 34.13 కోట్లు రెండో డోసుకు సంబంధించినవి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ట్వీట్‌ చేసింది. కరోనాపై పోరాటంలో మరో ఘనత సాధించినట్లు పేర్కొంది. శనివారం 27.43 లక్షలకు పైగా డోసులు వేశారు. మరోవైపు ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 116.54 కోట్లకు పైగా డోసులను ఉచితంగా సరఫరా చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం వాటి వద్ద 15.69 కోట్లకు పైగా డోసులు నిల్వ ఉన్నట్లు  తెలిపింది.

32 శాతం మందికే రెండు డోసులు..

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే.. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ మొదట్లో టీకా కొరత ఉన్నట్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన రాష్ట్రాలు.. ప్రస్తుతం పంపిణీలో మాత్రం డీలా పడినట్లు తెలుస్తోంది. సెప్టెంబరులో రోజువారీగా 78 లక్షల డోసులను పంపిణీ చేయగా, అక్టోబర్‌ నాటికి 56 లక్షలకు తగ్గడం గమనార్హం. ఇప్పటివరకు కేవలం 32 శాతం మందికి మాత్రమే రెండు డోసులు అందించారు. అయితే సెకండ్‌ డోసు తీసుకునేందుకు చాలా మంది ముందుకు రావడం లేదని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని